Fri Dec 20 2024 05:18:02 GMT+0000 (Coordinated Universal Time)
NTR : 'గుంటూరు కారం' సినిమా ఎన్టీఆర్ చేయాల్సిందా..?
'గుంటూరు కారం' సినిమా ఎన్టీఆర్ చేయాల్సిందా..? 'అయినను పోయి రావలె హస్తినకు' సినిమా కథనే..
NTR : మహేష్ బాబుని పక్కా మాస్ రోల్ లో చూపిస్తూ త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'గుంటూరు కారం'. ఈరోజు జనవరి 12న భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకోవడంలో తడబడిందని చెబుతున్నారు. మూవీ మొత్తాన్ని మహేష్ ముందుండి నడిపించినప్పటికీ.. కథలో దమ్ము లేకపోవడంతో థియేటర్ లో నిరాశ కలిగిస్తుంది. దీంతో మహేష్ అభిమానులు త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు.
మరో పక్క ఎన్టీఆర్ అభిమానులు సంతోషం పోస్టులు వేస్తున్నారు. అయితే వారు సంతోష పడుతుంది.. మహేష్ సినిమా ప్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నందుకు కాదు, ఆ సినిమాని ఎన్టీఆర్ వదులుకున్నందుకు. గుంటూరు కారం సినిమాని ముందుగా ఎన్టీఆర్ తోనే అనుకున్నారట త్రివిక్రమ్. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
త్రివిక్రమ్ 'అల వైకుంఠపురంలో' తెరకెక్కిస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ టైటిల్ కూడా అప్పటిలో బయటకి వచ్చింది. 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ తో ఓ పొలిటికల్ టచ్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ కథనే త్రివిక్రమ్.. అటు ఇటు మార్చి మహేష్ తో గుంటూరు కారం చేశారని ఇప్పుడు గట్టిగా టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా కథ అంతా పొలిటికల్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అధికారంలోకి రావడం కోసం సొంత కూతురి కొడుకుని, భర్తని దూరం చేసిన తండ్రి. అలా అమ్మకి దూరంగా పెరిగిన కొడుకు.. పొలిటికల్ గేమ్ లో భాగంగా మళ్ళీ ఆ కుటుంబంలోకి ఎలా వచ్చాడు అనే స్టోరీ లైన్ తో సినిమా సాగుతుంది. మహేష్ క్యారెక్టర్ కూడా మాస్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ కోసమే అలా డిజైన్ చేసి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా, గుంటూరు కారం ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.
Next Story