సూపర్ స్టార్ క్యూట్ ఫ్యామిలీ
మహేష్ బాబు వృత్తిపరంగా ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో… ఫ్యామిలీ విషయంలోనూ అంతే పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్స్ తో అలిసిసొలసి తన పిల్లలకి స్కూల్ సెలవులు [more]
మహేష్ బాబు వృత్తిపరంగా ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో… ఫ్యామిలీ విషయంలోనూ అంతే పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్స్ తో అలిసిసొలసి తన పిల్లలకి స్కూల్ సెలవులు [more]
మహేష్ బాబు వృత్తిపరంగా ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో… ఫ్యామిలీ విషయంలోనూ అంతే పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్స్ తో అలిసిసొలసి తన పిల్లలకి స్కూల్ సెలవులు రాగానే భార్యతో కలిసి విదేశాలకు ఎగిరిపోయే మహేష్ బాబు గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. మహేష్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి చాలామంది హీరోలు ఇన్స్పైర్ అవుతుంటారు. ఇక ఎప్పుడూ వెకేషన్స్ ని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేసే మహేష్ ఈసారి దసరా హాలిడేస్ కి స్విజ్జర్లాండ్ లో ల్యాండ్ అయ్యాడు. నమ్రత – గౌతమ్ కృష్ణ సితారాలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ఫుల్ గా ఎంజాయ్ చేసాడు మహేష్.
అభిమానులు హ్యాపీ….
ఆ ఎంజాయ్మెంట్ ని మాటలలో వర్ణించడం ఎందుకులే అనుకున్నాడేమో ఓ క్యూట్ ఫ్యామిలీ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను హ్యాపీ చేసాడు మహేష్ బాబు. వోగ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజు ఒక ఎత్తైతే… తాజాగా ఫ్యామిలీతో ఇచ్చిన క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ మరో ఎత్తు. మహేష్ బాబు చైర్ లో స్టైలిష్ గా కూర్చుంటే గౌతమ్ ఆ కూర్చు అంచు మీద తల్లి నమ్రతని అనుకుని కూర్చున్నాడు. ఇక క్యూట్ సితార పాప మహేష్ ఒడిలో స్టైలిష్ లుక్ అండ్ స్మైల్ తో కూర్చుంటే నమ్రత మాత్రం సింపుల్ గా భర్త వెనకాల నిల్చుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ ఇంట్రెన్ట్ లో తెగ వైరల్ అయ్యింది.