Mon Dec 23 2024 03:29:47 GMT+0000 (Coordinated Universal Time)
SSMB28 అప్డేట్.. నాన్న ఇది నీకోసం అంటూ మహేశ్ ట్వీట్
ముఖ్యంగా సినిమా టైటిల్ ప్రకటన పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు మహేష్ తండ్రి, ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ జయంతి..
సూపర్ స్టార్ మహేష్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా #SSMB28. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న మహేశ్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సినిమా టైటిల్ ప్రకటన పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు మహేష్ తండ్రి, ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ జయంతి సందర్భంగా #SSMB28 టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా.. #SSMB28 నుండి మరో పోస్టర్ ను విడుదల చేశారు మహేష్.
కృష్ణ జయంతి సందర్భంగా మహేష్.. నాన్న ఇది నీ కోసం అంటూ స్పెషల్ ట్వీట్ చేశారు. తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. కృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి సారిగా వచ్చిన కౌబాయ్ సినిమా.. మోసగాళ్లకు మోసగాడు సినిమాను థియేటర్స్ లో రీ రిలీజ్ అయింది. సాయంత్రం 6.03 నిమిషాలకు మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ అయిన థియేటర్స్ లో మహేష్ - త్రివిక్రమ్ ల #SSMB28 టైటిల్, గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.
Next Story