ఫ్యాన్స్ తో చెప్పిందే చేస్తున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు డిజాస్టర్ లు కావడంతో ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథల విషయంలో ఒకటికి రెండు [more]
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు డిజాస్టర్ లు కావడంతో ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథల విషయంలో ఒకటికి రెండు [more]
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు డిజాస్టర్ లు కావడంతో ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథల విషయంలో ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు. వంశీ పైడిపల్లి సినిమా లేట్ అవ్వడానికి అదే కారణం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మహర్షి ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అంతకముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలా కాకుండా కొంచం జాగ్రత్త పడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మహర్షిలా ఇది కూడా యూనిక్ సబ్జెక్టుతో ఉండే కథ అని చెబుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ స్టోరీతో…
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఇందులో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి. అయితే మహేష్ రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో జరిపిన చిట్ చాట్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనెర్ చిత్రాలు చేయనని ఓన్లీ యూనిక్ సబ్జెక్టులను మాత్రం సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తానని చెప్పాడట.