Mon Dec 23 2024 15:41:27 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh - Charan : మహేష్, చరణ్ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్..? ఇవి గమనించారా..?
మహేష్ బాబు, రామ్ చరణ్ రీసెంట్ ఫొటోల్లో మీరు ఇది గమనించారా..? వీరిద్దరూ ఇంత దగ్గర స్నేహితులా..?
Mahesh Babu - Ram Charan : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా ఉంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇతర హీరోల సాన్నిహిత్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా ప్రతి ఒక్కరు చరణ్ తో చాలా క్లోజ్ గా ఉంటూ కనిపిస్తారు. కాగా రీసెంట్ గా రామ్ చరణ్ తన ఇంట దివాళీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యామిలీస్ తో సహా హాజరయ్యి సందడి చేశారు. ఈ పార్టీ కంటే ముందు మహేష్, చరణ్, వెంకటేష్ మరో పార్టీలో కూడా సందడి చేశారు. ఇక ఈ పార్టీలు అన్నిటికి సంబంధించిన ఫోటోలు అన్ని నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు సంబర పడుతూనే.. ఆ ఫొటోల్లో ఒక విషయాన్ని గమనించారు. దాని అందరికి చూపిస్తూ మహేష్, చరణ్ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్..? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ మహేష్, చరణ్ ఫొటోల్లో అభిమానులు ఏం గమనించారంటే.. కొన్ని రోజులు క్రితం వెంకటేష్, చరణ్, మహేష్ కలిసి కనిపించిన పార్టీలో మహేష్ బాబు తన కాళ్ళకి తెలుపు రంగు చెప్పులు ధరించి కనిపించారు. తాజాగా అవే చెప్పులను రామ్ చరణ్ తన ఇంటిలో ఫ్యామిలీ మెంబెర్స్ తో దిగిన ఫొటోలో ధరించి కనిపించారు. ఇక ఇది గమనించిన అభిమానులు.. "ఒకరి చెప్పులు ఒకరు వేసుకునేంత దగ్గర స్నేహితులా వీరిద్దరూ" అంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పిక్స్ లో మరో విషయాలు కూడా గమనించారు. మహేష్ బాబు ఒకే డిజైన్ ఉన్న టి-షర్ట్ ని కలర్స్ మార్చి ధరించడం, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ పగిలి ఉన్న ఫోన్ ని ఉపయోగించడం.. వంటి విషయాలను కూడా అభిమానులు గుర్తించారు. వీటిని చూపిస్తూ చిన్నోడు, పెద్దోడు కూడా మనలాగానే ఫోన్, డ్రెస్సులు ఉపయోగిస్తున్నారు అంటూ పోస్టులు వేస్తున్నారు.
Next Story