Fri Dec 20 2024 22:01:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏఎన్నార్ విగ్రహావిష్కరణ వేడుక.. వెంకయ్య నాయుడు, మహేష్, చరణ్..
వెంకయ్య నాయుడు, మహేష్ బాబు, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ వేడుక.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి నేడు కావడంతో అక్కినేని కుటుంబం గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఏఎన్నార్.. సినీ రంగంలో ఒక లెజెండ్ గా ఎదిగారు. తెలుగు సినిమాలోనే కాదు భారతీయ చలనచిత్రలో అక్కినేని ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాది 100వ జయంతి జరుగుతుండడంతో అక్కినేని కుటుంబం.. ఈ జయంతిని ఘనంగా చేస్తున్నారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణకు అక్కినేని ఫ్యామిలీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి ఏఎన్నార్ కి నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన చేతులు మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్, జగపతి బాబు, బ్రహ్మానందం, మంచు విష్ణు, నాజర్.. తదితరులు ఈ వేడుకకు హాజరయ్యి అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఏఎన్నార్ శతజయంతి కావడంతో సినీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి ఆయనకు నివాళి అర్పిస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు. తెలుగు సినిమా బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నాడు.
Next Story