Mon Dec 23 2024 11:59:52 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్.. అమెరికాలో..
ఇప్పటికే టీజర్, గ్లింప్స్, రీ రిలీజ్ ట్రెండ్స్ స్టార్ట్ చేసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ని అమెరికాలో..
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ లాగానే కొత్త ట్రెండ్స్ ని స్టార్ట్ చేస్తూ.. ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వింటున్న మోషన్ పోస్టర్ రిలీజ్, గ్లింప్స్ రిలీజ్, టీజర్ రిలీజ్, థియేటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్, ఫ్యాన్స్తో ఫస్ట్ లుక్, రీ రిలీజ్ ట్రెండ్.. ఇలా చాలా ట్రెండ్స్ ని మహేష్ బాబే మొదలు పెట్టారు. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారట. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్లో ఈ ఈవెంట్ ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. తెలుగు మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో లైవ్ టెలికాస్ట్ అవ్వడం ఇదే మొదటిసారి. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రోజునే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట.
Next Story