Thu Jan 02 2025 16:15:50 GMT+0000 (Coordinated Universal Time)
సితార తొలి కూచిపూడి నృత్యం.. వీడియో షేర్ చేస్తూ విషెస్ చెప్పిన మహేష్
సితార మొట్టమొదటి కూచిపూడి నృత్య పఠనం… ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఈ శ్లోకం ..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. పలు ప్రాంతాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని భారీ శోభాయాత్రలను కూడా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు.. తన కూతురు సితార కూచిపూడి డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కూతురు కూచిపూడి నాట్యాన్ని చూసిన మహేష్.. పొగడ్తల వర్షం కురిపించారు.
"సితార మొట్టమొదటి కూచిపూడి నృత్య పఠనం… ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది! నా సీతూ పాపా క్రాఫ్ట్ పట్ల నీకున్న అంకితభావం నాకు విస్మయం కలిగిస్తోంది! మీరు నన్ను మరింత గర్వించేలా చేసారు! నీకు అపారమైన గౌరవం, ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను. ఈ అందమైన నృత్యాన్ని సీతారాకు నేర్పించినందుకు అరుణ భిక్షు గారు, మహతీ భిక్షు గారికి ధన్యవాదాలు. మీ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. మీ రోజు ప్రకాశవంతంగా, ప్రేమ, కాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ మహేష్ వరుస ట్వీట్లు చేశారు. సితా పాప కూచిపూడి నృత్యంపై మీరూ ఓ లుక్కేయండి !
Next Story