Mon Dec 23 2024 19:55:16 GMT+0000 (Coordinated Universal Time)
8 ఏళ్ళ క్రిందటి మహేష్ మూవీ.. ఇప్పుడు కొత్త రికార్డుని..
సరికొత్త రికార్డుని సృష్టించిన మహేష్ బాబు మూవీ. దాదాపు 8 ఏళ్ళ క్రిందట రిలీజ్ అయిన..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చిత్రాలు రికార్డులు సాధించడం పెద్ద కొత్తఏమీ కాదు. టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు ఓపెనింగ్స్ చూసే మహేష్ సినిమాలు.. నార్మల్ టాక్ వచ్చినా సంచలన రికార్డులకు దారి తీస్తాయి. అయితే ఇప్పుడు మహేష్ నటించిన సినిమా ఏం రిలీజ్ అయ్యింది. ఈ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి అని ఆలోచిస్తున్నారా..? రికార్డు సృష్టించింది ఇప్పటి సినిమా కాదు.. దాదాపు 8 ఏళ్ళ క్రిందట రిలీజ్ అయిన సినిమా.
మహేష్ బాబు కొరటాల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'శ్రీమంతుడు'. ఊరుని దత్తత తీసుకోవాలి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 70 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.200 కోట్ల కలెక్షన్స్ వరకు రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డుని సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీని 2017లో ఆడియన్స్ కోసం యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ మూవీని.. దాదాపు 200,041,750 మంది చూడగా, 834K మంది లైక్స్ కొట్టారు. యూట్యూబ్ లో ఇలా 200 మిలియన్ల వ్యూస్ అందుకున్న ఫస్ట్ తెలుగు మూవీగా శ్రీమంతుడు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దీంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వేదిక ఏదైనా బాబు ల్యాండ్ అవ్వనంత వరుకే, ఒక్కసారి బాబు గనుక ల్యాండ్ అవుతే కొత్త రికార్డులు పుట్టుక రావాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ నటించిన సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ తో గుంటూరు కారం (Guntur Kaaram) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ కనిపించనంత మాస్ గా ఈ మూవీలో కనిపించబోతున్నాడట. దీంతో అభిమానుల్లో ఈ మూవీ పై భారీ హైప్ నెలకుంది.
Next Story