Sun Dec 22 2024 08:16:23 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : గుంటూరు కారం రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకున్న మహేష్ బాబు గుంటూరు కారం రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తి మాస్ రోల్ లో కనిపిస్తూ చేసిన సినిమా 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం జనవరి 12న రిలీజయింది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై భారీ హైప్ నెలకుండడంతో సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజైన ఈ చిత్రం.. 94 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనంగా మారింది.
ఈమధ్య కాలంలో తెలుగు రీజినల్ సినిమాలు పెద్దగా సత్తా చాట లేకపోయాయి. ఈ సమయంలో గుంటూరు కారం టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. మొదటి రోజు 100 కోట్లకు చేరుకున్న కలెక్షన్స్ కౌంట్.. రెండో రోజు హనుమాన్, సైంధవ్ చిత్రాలతో పోటీపడి 33 కోట్ల గ్రాస్ ని నమోదు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం మొత్తం మీద 127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.130 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సుమారు 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాలి. అంటే 135 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ప్రస్తుతం పండుగ సమయం కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా గుంటూరు కారం పై ఆదరణ పెరగడంతో.. ఈ మూవీ 270 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు.
Next Story