Sun Dec 22 2024 17:39:49 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరు కారం నుండి అర్ధరాత్రి వచ్చిన అప్డేట్ ఇదే
మహేష్ బాబు నుండి మాస్ సినిమా కావాలని.. మెసేజీ గట్రా లేని యాక్షన్ ఎంటర్టైనర్
మహేష్ బాబు నుండి మాస్ సినిమా కావాలని.. మెసేజీ గట్రా లేని యాక్షన్ ఎంటర్టైనర్ చూడాలని అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. అతడు, ఖలేజా లాంటి సినిమాలు తీసిన త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో మహేష్‌ను ఊరమాస్ లెవల్లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు ఫస్ట్ లుక్ సీన్ లో కూడా మహేష్ బాబు లుక్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు కారం సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ను వదిలారు. లుంగీలో కూర్చొని ఓ చేతిలో అగ్గిపెట్ట, మరో చేతితో సిగరెట్‌ను అంటిస్తూ పోస్టర్ లో మహేష్ కనిపించాడు. సినిమాకు సంబంధించిన ఓ పాట గానీ, టీజర్ లాంటిది రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశించగా.. అలాంటిదేమీ లేకపోవడంతో కాస్త నిరాశ చెందారు.
ఇక ఈ సినిమా నుండి పలువురు టెక్నీషియన్స్ తప్పుకుంటూ ఉండడంతో అభిమానుల్లో కూడా కాస్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్‌లు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మొదట హీరోయిన్ గా అనుకున్న పూజా హెగ్డేను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి సినిమాలో నటించనున్నారు.
Next Story