Mon Dec 23 2024 15:55:36 GMT+0000 (Coordinated Universal Time)
నానమ్మని చూసి వెక్కివెక్కి ఏడ్చిన సితార.. కేటీఆర్ నివాళి
తల్లిని చూసి మహేశ్-నమ్రత ఎమోషనల్ అయ్యారు. వారిద్దరి కన్నా సితార ఎక్కువ ఎమోషనల్ అయింది. నానమ్మ ఇందిరా దేవి..
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం ఆమె నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఎంతో సింపుల్ గా ఉండే ఇందిరా దేవి గురించి బయటి వ్యక్తులకు తెలిసింది చాలా తక్కువ. ఫేమ్ కి దూరంగా మహేశ్ కి తల్లిని అనే గర్వం, దర్పం లేకుండా సాధారణ జీవనం సాగించిన ఆ మాతృమూర్తి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తల్లిని చూసి మహేశ్-నమ్రత ఎమోషనల్ అయ్యారు. వారిద్దరి కన్నా సితార ఎక్కువ ఎమోషనల్ అయింది. నానమ్మ ఇందిరా దేవి భౌతికకాయాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చింది. సితారను మహేశ్- నమ్రత ఎంతలా ఓదార్చినా ఆమె ఏడుస్తూనే ఉంది. నానమ్మను చూసి సితార ఏడుస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖుల నివాళి
సినీ నటుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఇందిరాదేవి మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు. నాగార్జున, మోహన్ బాబు, గోపీచంద్, అల్లు అరవింద్ తదితరులు కూడా నివాళి అర్పించారు. నేటి మధ్యాహ్నం ఇందిరా దేవి అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story