Wed Jan 15 2025 21:38:30 GMT+0000 (Coordinated Universal Time)
నాకు అమ్మంటే దేవుడితో సమానం : మహేశ్
ఇందిరాదేవి అంటే మహేశ్ కు చాలా ఇష్టం. చాలాసార్లు సినిమా ఫంక్షన్లలో తల్లిపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మాతృమూర్తి, కృష్ణ భార్య ఇందిరాదేవి బుధవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సాధారణంగా ఇందిరా దేవి గురించి బయటివారికి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె ఎలాంటి సినిమా ఫంక్షన్లకు గానీ.. కార్యక్రమాలకు గానీ బయటికొచ్చేవారు కాదు. ఒక సూపర్ స్టార్‌కు సతీమణి, మరో సూపర్ స్టార్‌కు తల్లి అన్న దర్పం లేకుండా చాలా సాధారణ జీవితం గడిపారామె. మహేశ్ బాబుకి తల్లితో ఎనలేని అనుబంధం ఉంది.
ఇందిరాదేవి అంటే మహేశ్ కు చాలా ఇష్టం. చాలాసార్లు సినిమా ఫంక్షన్లలో తల్లిపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. ఇందిరా దేవి మరణించిన నేపథ్యంలో గతంలో మహేశ్ బాబు తన తల్లి గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో తన తల్లి అంటే ఎంతో ఇష్టమని, ప్రతి సినిమా విడుదల సందర్భంగా ఆమె దగ్గరికి వెళ్లి కాఫీ తాగొస్తుంటానని చెప్పారు. ఆ కాఫీ తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తీసుకున్నట్లుగా అనిపిస్తుందని మహేశ్ తెలిపారు. తన వరకూ తల్లి అంటే దేవుడితో సమానమన్నారు.
Next Story