Mon Dec 23 2024 15:10:54 GMT+0000 (Coordinated Universal Time)
Marriage Anniversary : మహేష్, నమ్రత ల ఎమోషనల్ పోస్టులు
మహేష్, నమ్రతలు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేశారు. "మన బంధం కొంచెం క్రేజీ, అలాగే ప్రేమతో నిండినది.
టాలీవుడ్ లో ఉన్న స్టార్ కపుల్స్ లిస్ట్ లో టాప్ లో ఉంటారు మహేష్ - నమ్రత. మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన నమ్రత.. 2000లో ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మహేష్ బాబు హీరో. తొలి చూపులోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఐదేళ్లపాటు సీక్రెట్ గా డేటింగ్ చేసిన ఈ జంట.. 2005లో అతడు మూవీ షూటింగ్ సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ముంబైలోని ఓ హోటల్ లో ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. ఈ రోజుకి వీరి వివాహం జరిగి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు.
ఈ సందర్భంగా.. మహేష్, నమ్రతలు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేశారు. "మన బంధం కొంచెం క్రేజీ, అలాగే ప్రేమతో నిండినది. 18 ఏళ్ళగా ఇద్దరు కలిసి నడిచాం, ఎప్పటికి ఇలానే ఉందాం. హ్యాపీ యానివర్సరీ నమ్రతా" అంటూ తమ పాత ఫోటో పోస్ట్ చేస్తూ మహేష్ బాబు రాసుకొచ్చాడు. అలాగే నమ్రతా, మహేష్ బాబుని ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ.. "18 ఏళ్ళ క్రితం మేము తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ యానివర్సరీ మహేష్" అంటూ నమ్రతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story