వంశీ - మహేష్ ల సినిమా ఆగిపోనుందా..?
మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా తర్వాత మహేష్.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ జూన్ నుండి ప్రారంభం కానుంది. మహేష్ తో 'బ్రహ్మోత్సవం'తో పాటు మొత్తం నాలుగు సినిమాలకు హోల్ సేల్ ప్యాకేజ్ మాట్లాడుకున్న నిర్మాత పివిపి ప్రసాద్.. ఆ టైంలోనే వంశీ - మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని ప్రకటించాడు కూడా. కానీ వంశీ ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్ లతో చేయబోతున్నట్టు చెప్పేశాడు.
బంతి కోర్టులో....
దాంతో నిర్మాత పివిపి ఈ సినిమాను నిర్మించే బాధ్యత నా ఒక్కడికే ఉందని కోర్టు మెట్లు కూడా ఎక్కాడు. కోర్టు కూడా ప్రస్తుతానికి ఈ సినిమాపై స్టే ఇచ్చింది. దీని హియరింగ్ జూన్ 4 అంటే సోమవారం రానుంది. వచ్చే తీర్పు బట్టి సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నదానిపైన ఓ నిర్ణయం కి రానున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పివిపి సంస్థ ఆఫీస్ లోనే జరిగింది. కానీ 'బ్రహ్మోత్సవం' తర్వాత పివిపి బ్యానర్లో మరో సినిమా వెంటనే చేయడానికి ఇష్టపడని మహేష్ అందుకే దిల్ రాజు, అశ్వినిదత్ లకు టర్న్ ఇచ్చాడని గతంలోనే వార్తలు వచ్చాయి.
సుకుమార్ ని రెడీగా ఉండమన్న మహేష్
దీనికి సంబంధించిన వివాదం దిల్ రాజు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయింది అనుకున్నారు. కానీ కాలేదనే క్లారిటీ వచ్చేసినట్టే. ఒకవేళ ఈ సినిమా ఆగిపోతే సుకుమార్ కు స్క్రిప్ట్ తో రెడీ గా ఉండమని మహేష్ చెప్పేశాడట. ఒకవేళ వంశీ సినిమా ఆగిపోతే మహేష్.. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ లో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ సోమవారం వచ్చే కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.