మహేష్ – పరశురామ్ ప్లాన్ అదా?
మహేష్ బాబు కరోనా లాక్ డౌన్ తో మాత్రమే కాకుండా సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఎనిమిది నెలలుగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. కరోనా అని కాదుగాని [more]
మహేష్ బాబు కరోనా లాక్ డౌన్ తో మాత్రమే కాకుండా సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఎనిమిది నెలలుగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. కరోనా అని కాదుగాని [more]
మహేష్ బాబు కరోనా లాక్ డౌన్ తో మాత్రమే కాకుండా సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఎనిమిది నెలలుగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. కరోనా అని కాదుగాని మహేష్ మాత్రం తన ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా గడిపేస్తున్నాడు. నిన్నమొన్నటివరకు షూటింగ్ పేరెత్తని మహేష్ బాబు తాజాగా ఓ యాడ్ షూట్ లో కనిపించి షాకిచ్చాడు. రెండు రోజుల్లోనే ఆ యాడ్ షూట్ ప్యాకప్ చెప్పెయ్యబోతున్న మహెష్ బాబు పరశురామ్ తో చెయ్యబోయే సర్కారు వారి పాట షూటింగ్ విషయం తెగనియ్యడం లేదు. అయితే మహేష్ కూడా పాన్ ఇండియా ఆలోచన చేసి పరశురామ్ తో పాన్ ఇండియా లెవల్ కి స్క్రిప్ట్ లో మార్పులు చెయ్యమని చెప్పినట్టుగా సోషల్ మీడియా టాక్. అందుకే షూటింగ్ లేట్ అవుతున్నది అని అంటున్నారు.
ఇక పాన్ ఇండియా లెవల్లో స్క్రిప్ట్ లో మార్పులతో పాటుగా సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని భాగం చేసే యోచనలో ఇప్పటికే మహేష్ విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ని పరశురామ్ సంప్రదించాడనే న్యూస్ ని ఆధారంగా చేసుకుని మహేష్ – పరశురామ్ లు పాన్ ఇండియా ప్లాన్స్ లో ఉన్నారు అని.. అందుకే షూటింగ్ మొదలు పెట్టె ఆలోచన పక్కనబెట్టి.. పాన్ ఇండియా లెవల్లో సినిమాని తెరకెక్కించే ప్లాన్స్ లో వీరిద్దరూ బిజీ అనే మాట సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. మరి ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేసేస్తుంటే నేనెందుకు చెయ్యకూడదని మహేష్ ఫీలయ్యాడేమో అందుకే సర్కారు వారి పాటని పాన్ ఇండియా లేవలోకి మార్చుతున్నాడని అంటున్నారు.