మహేష్ చిన్న హీరోలకే కాదు… స్టార్ హీరోలకు..?
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలంతా ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఇతర హీరోలతో సినిమాల నిర్మాణం చేపడుతున్నారు. అందరిలాగే మహేష్ కూడా ఓ నిర్మాణ సంస్థని [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలంతా ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఇతర హీరోలతో సినిమాల నిర్మాణం చేపడుతున్నారు. అందరిలాగే మహేష్ కూడా ఓ నిర్మాణ సంస్థని [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలంతా ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఇతర హీరోలతో సినిమాల నిర్మాణం చేపడుతున్నారు. అందరిలాగే మహేష్ కూడా ఓ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి.. సినిమాలను నిర్మించడానికి రెడీ అవడమే కాదు.. అడవి శేష్ తో మేజర్ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే మీడియం అండ్ చిన్న హీరోల సినిమాలే కాకుండా మహేష్ బాబు పెద్ద హీరోలతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ఓ సినిమాని లైన్ లో పెట్టాడని… ఈ విషయంలో మహేష్ భర్య నమ్రత పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉందని.. కథ చర్చలు పూర్తయ్యాయని.. అలాగే ఈ సినిమ లో దిల్ రాజు భాగస్వామిగా ఉండబోతున్నాడట.
మరో పక్క తమిళ నటుడు కార్తితో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట మహేష్, మహేష్ కి కార్తీ తో ఉన్న స్నేహంతోనే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. కార్తీ కూడా రెడీగా ఉంటె… ఆ చిత్రాన్ని తెలుగులో తమిళంలో తెరకెక్కించాలని మహేష్ – నమ్రతల ప్లాన్ అట. మహేష్ బాబు జస్ట్ ఓకె చేస్తే చాలు నమ్రత అన్ని విషయాలను చక్కబెట్టేస్తుందట. ఓ పక్క వంశి పైడిపల్లి మరోపక్క మెహెర్ రమేష్ ల హెల్ప్ నమ్రత తీసుకుంటుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.