ఫ్యామిలీ తో…. 6 కోట్లు కొట్టేసిన మహేష్
మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అనగానే సోషల్ మీడియాలో లైక్స్ తో హోరెత్తిస్తారు ఆయన అభిమానులు. మహేష్ అభిమానులే కాదు… మిగతా వాళ్ళు కూడా మహేష్ ఫ్యామిలీ [more]
మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అనగానే సోషల్ మీడియాలో లైక్స్ తో హోరెత్తిస్తారు ఆయన అభిమానులు. మహేష్ అభిమానులే కాదు… మిగతా వాళ్ళు కూడా మహేష్ ఫ్యామిలీ [more]
మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అనగానే సోషల్ మీడియాలో లైక్స్ తో హోరెత్తిస్తారు ఆయన అభిమానులు. మహేష్ అభిమానులే కాదు… మిగతా వాళ్ళు కూడా మహేష్ ఫ్యామిలీ ని ఫొటోస్ చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రొఫెషనల్ గా, ఫ్యామిలీ పరంగా మహేష్ పర్ఫెక్ట్ గా ఉంటాడు. మహేష్ చాలా బిజీ కనుక ఆయన వైఫ్ నమ్రత ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తుంది. ఇక వెకేషన్స్ రాగానే ఫ్యామిలీతో మహేష్ తెగ ఎంజాయ్ చేస్తాడు. మహేష్ ఫ్యామిలికున్న క్రేజ్ తో ఓ యాడ్ ని తెరకెక్కించారు ఓ యాడ్ కంపెనీ వారు. మహేష్ , భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారాలతో కలిసి మహేష్ ఆ యాడ్ లో నటించాడు. ఫుల్లీ స్టైలిష్ గా ఉన్న ఫ్యామిలీతో మహేష్ చేసిన ఆ యాడ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది.
ఫ్యామిలీ బొనంజా….
మహేష్ ఫామిలీ తో కలిసి చేసిన యాడ్ కేవలం 30 సెకన్లు మాత్రమే ఉంది. ఆ 30 సెకెన్ల లోనే మహేష్, నమ్రత, సితార, గౌతమ్ లు ఆదిరిపోయే లుక్స్ తో అందంగా కనిపించడమే కాదు సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. తన ఫ్యామిలీ క్రేజ్ తో ఈ 30 సెకెన్ల యాడ్ కోసం మహేష్ బాబు అక్షరాలా 6 కోట్లు వసూలు చేశాడనే టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. మరి ఈ లెక్కన మహేష్ ఫ్యామిలీ పిక్ మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీ యాడ్ కూడా యమా కాస్ట్లీ గురూ