Mon Dec 23 2024 02:15:40 GMT+0000 (Coordinated Universal Time)
యాత్ర-2 పోస్టర్స్.. ఆ డైలాగ్ చూశారా?
యాత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
యాత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహించని సక్సెస్ సాధించింది ఈ సినిమా. దర్శకుడు మహి వి రాఘవ్ కు మంచి పేరు వచ్చింది. సినిమాను మరీ టూమచ్ పొలిటికల్ వే లో కాకుండా దివంగత రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ ఎంతో బాగా అల్లుకుని తీశారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా. ఇప్పుడు మరో సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు.
త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి…నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను పోస్టర్లో ఉంచారు.
ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రం రాగా.. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని.. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేశారు. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Next Story