రెండో సినిమా సెంటిమెంట్ ను తుడిచేసిన ఈ డైరెక్టర్స్
మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి ద్వితీయ సినిమా గండం ఉంది. మొదటి సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకుని రెండు సినిమాతో డిజాస్టర్ తెచ్చుకున్న డైరెక్టర్స్ మన దగ్గర [more]
మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి ద్వితీయ సినిమా గండం ఉంది. మొదటి సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకుని రెండు సినిమాతో డిజాస్టర్ తెచ్చుకున్న డైరెక్టర్స్ మన దగ్గర [more]
మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి ద్వితీయ సినిమా గండం ఉంది. మొదటి సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకుని రెండు సినిమాతో డిజాస్టర్ తెచ్చుకున్న డైరెక్టర్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు. రాజమౌళి..కొరటాల..వినాయక్ లాంటి వాళ్లు తప్ప. కానీ ఈ సెంటిమెంట్ ని ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తుడిచేసారు. అది కూడా ఒకే నెలలో కావడం విశేషం.
ఒక్కరు డైరెక్టర్ శివ నిర్వాణ. న్యాచురల్ స్టార్ నాని తో శివ నిన్ను కోరి అనే సినిమాతో సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ గా ఈసినిమా మంచి వసూల్ చేసింది. ఆ తరువాత శివ నాగ చైతన్య – సమంత లు పెట్టి మజిలీ అనే ఫీల్ గుడ్ మూవీ తీసాడు. ఇది వీరిద్దరికి కెరీర్ బెస్ట్ మూవీ గా నిలవనుంది. భార్య భర్తలు మధ్య ఎమోషన్స్ ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోవడంతో సినిమా హిట్ అయిపోయింది.
మరో దర్శకుడు గౌతం తిన్ననూరి. సుమంత్ హీరో గా ఈ డైరెక్టర్ మళ్ళి రావా అనే చిన్న సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన గౌతమ్ కి రెండో సినిమాకే నాని లాంటి హీరో దొరికాడు. నాని తో ఇతను జెర్సీ అనే సినిమా తీసి ఎంత సక్సెస్ అయ్యాడో మనమే చూసాం. సో గౌతమ్ కూడా కూడా ద్వితీయ గండాన్ని దాటేశాడు. కథలో విషయం ఉంటె ఈ సెంటిమెంట్స్ పనేంటి.