టాలీవుడ్ లో క్రికెట్ ఫీవర్
టాలీవుడ్ లో ఎప్పటినుండో ఒక ఫార్మాట్ నడుస్తుంది. అదే కమెర్షియల్ ఫార్మాట్. డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేయడానికి మనవాళ్ళు అంత ఇష్టపడరు. ఎక్కడ లాస్ వస్తుందో [more]
టాలీవుడ్ లో ఎప్పటినుండో ఒక ఫార్మాట్ నడుస్తుంది. అదే కమెర్షియల్ ఫార్మాట్. డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేయడానికి మనవాళ్ళు అంత ఇష్టపడరు. ఎక్కడ లాస్ వస్తుందో [more]
టాలీవుడ్ లో ఎప్పటినుండో ఒక ఫార్మాట్ నడుస్తుంది. అదే కమెర్షియల్ ఫార్మాట్. డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేయడానికి మనవాళ్ళు అంత ఇష్టపడరు. ఎక్కడ లాస్ వస్తుందో అని భయపడి వాటి జోలికి వెళ్ళరు. తెలుగు ఆ మధ్య ఎప్పుడో రెండు మూడు క్రికెట్ కు సంబంధించి సినిమాలు వచ్చాయి. అయితే అందులో హీరోను క్రీడాకారుడిగా చూపించి పైపైనే లాగించేసారు. తొలిప్రేమ అండ్ వసంతం సినిమాల్లో హీరోను క్రికెటర్గా చూశాం కానీ.. ఆట మీద పెద్దగా ఫోకస్ ఉండదు.
అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. పూర్తి స్థాయి క్రికెట్ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. రియల్ క్రికెటర్ల మాదిరే ఆయా పాత్రల్ని తీర్చిదిద్ది ఒక అథెంటిసిటీ తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ట్రెండే నడుస్తుంది. చాలా తక్కువ గ్యాప్ లో ప్రధాన పాత్రధారులు క్రికెటర్లుగా ఉన్న సినిమాలు తక్కువ వ్యవధిలో మూడు వస్తుండటం విశేషం. గత వారం రిలీజ్ అయినా మజిలీ సినిమాలో చైతు క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చైతు క్రికెటర్. సినిమా మొత్తం దీని చుట్టూనే తిరుగుతూ ఉంటది.
అలానే వచ్చే వారం నాని జెర్సీ సినిమా వస్తుంది. ఇందులో కూడా నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.ఇది పూర్తిగా క్రికెట్ చుట్టూ తిరిగే సినిమా అన్న సంగతి తెలిసిందే. అలానే వచ్చేనెల లో రిలీజ్ కానున్న ‘డియర్ కామ్రేడ్’ హీరోయిన్ రష్మికది క్రికెట్ క్యారెక్టర్ కావడం విశేషం. ఇలా వరుసబెట్టి ఇటువంటి సినిమాలు రావడం విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండగా.. వచ్చే నెలలో ప్రపంచకప్ మొదలు కానుంది. దింతో ఈసినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. మాస్ తో పాటు యూత్ కి కూడా కనెక్ట్ అయ్యే సినిమాలు కాబట్టి మేకర్స్ కూడా క్రికెట్ నేపథ్యంలో సాగే కథలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.