Mon Dec 23 2024 15:57:39 GMT+0000 (Coordinated Universal Time)
టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేష్.. విభిన్నంగా మేజర్ మూవీ ప్రమోషన్స్
మహేశ్ ను చూసిన నిహారిక ఆశ్చర్యపోతుంది. అప్పుడు మహేశ్.. మా స్నేహితులను కూడా పిలవొచ్చా? అని ప్రశ్నించగా, అందుకు ..
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మేజర్ మూవీ ప్రమోషన్స్ ను విభిన్నంగా చేశారు. తాను నిర్మించిన మేజర్ సినిమాను మహేష్ ప్రమోట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం.. సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ క్యూలో నిల్చుంటుంది. అయితే, ఒకరి తర్వాత ఒకరిగా వచ్చిన కొందరు ఆమె కంటే ముందు నిల్చుంటారు. దీంతో నిహారిక ఆశ్చర్యపోతుంది. కాసేపటికి హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చోగా.. వారిద్దరికీ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ గొడవ మధ్యలోనే మహేశ్ బాబు వచ్చి వారిద్దరి కన్నా ముందు నిల్చుంటాడు.
మహేశ్ ను చూసిన నిహారిక ఆశ్చర్యపోతుంది. అప్పుడు మహేశ్.. మా స్నేహితులను కూడా పిలవొచ్చా? అని ప్రశ్నించగా, అందుకు ఆమె ఓకే అంటుంది. దీంతో లైన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందర్భంగా మహేశ్ ఫోన్ నంబరు తీసుకోవాలని భావించి అడిగే లోపే అతడు వెళ్లిపోతాడు. ఇంతలో అడవి శేష్ నా నంబర్ ఇవ్వనా ? అని అడుగుతాడు. హా ఇవ్వండి అని నిహారిక చెప్పగా.. అతను తన మొబైల్ నంబర్ ఇస్తాడు. నిహారిక ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. వైరల్ అయింది. కాగా.. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
Next Story