Mon Dec 23 2024 04:03:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎఫ్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సింది కానీ.. కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 29న
వెంకటేష్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా ఎఫ్ -2 కి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం ఎఫ్ -3. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకీ - వరుణ్ లతో తమన్నా, మెహరీన్ మరోసారి జతకట్టారు. ఈ ఇద్దరు హీరోలతో పాటు కామెడీ హీరో సునీల్ కూడా ఎఫ్ 3లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సింది కానీ.. కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు కానీ.. ఆ రోజు కూడా విడుదల చేయడం లేదు.
Also Read : మరో 54 చైనా యాప్ లను నిషేధించిన భారత్
ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా విడుదల కానుండటంతో.. సినీ నిర్మాలంతా చర్చించుకుని ఆర్ఆర్ఆర్ కోసం ఆయా సినిమాలు డేట్స్ త్యాగం చేశాయి. వాటిలో ఎఫ్ 3 కూడా ఒకటి. తాజాగా ఎఫ్ 3 ఫైనల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మే 27వ తేదీన ఎఫ్ 3 సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. "పిల్లలు పరీక్షలు ముగించుకోండి .. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి .. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాము" అంటూ ఈ కొత్త పోస్టర్ ను వదిలారు.
Next Story