Mon Dec 23 2024 07:25:27 GMT+0000 (Coordinated Universal Time)
మేజర్ కు రూట్ క్లియర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ !
తాజాగా "మేజర్" మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన మేజర్ ను తెలుగుతో పాటు మళయాళ, హిందీ
కొన్నేళ్ల క్రితం ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అత్యంత ధైర్య సాహసాలతో పాల్గొన్నారు. ఆ సంఘటన ఆధారంగా.. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా మేజర్. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. కరోనా లేకపోయి ఉంటే.. గతేడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. తెలిసిందేగా.. కరోనా కారణంగా చాలా సినిమాల రిలీజ్ లు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి.
ఇప్పుడిప్పుడే మళ్లీ విడుదళ్లకు సిద్ధమవుతున్నాయి. తాజాగా "మేజర్" మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన మేజర్ ను తెలుగుతో పాటు మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అడవి శేష్ సరసన సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ నటించారు. ఇక ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ పై జరిగిన ఉగ్రదాడి ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో మేజర్ పై భారీ అంచనాలున్నాయి.
Next Story