Mon Dec 23 2024 13:18:14 GMT+0000 (Coordinated Universal Time)
రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్స్ ప్రకటించిన మేకర్స్
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్
ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించడమే తరువాయి.. వరుసగా పెద్ద సినిమాలన్నీ విడుదలకు క్యూ కట్టాయి. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన అనంతరం.. ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారువారి పాట సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. తాజాగా రవితేజ నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం కూడా విడుదల తేదీని ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లు మార్చి 25వ తేదీన సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఆ రోజు వీలుకాకుంటే.. ఏప్రిల్ 15న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా.. రవితేజ ప్రస్తుతం 5 ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. రవితేజ నటించిన ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత రావణాసుర సినిమా విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఏకంగా 5 సినిమాలతో వస్తోన్న రవితేజకు 2022 కిక్ ఇస్తుందో లేదో చూడాలి.
News Summary - Makers Announced Rama Rao on Duty Release Dates
Next Story