Mon Dec 23 2024 07:53:24 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప ఐటెం సాంగ్ - కుర్రకారుకి మత్తెక్కిస్తోన్న సమంత
తాజాగా పుష్ప సినిమా నుంచి ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ ఐటెం సాంగ్ లో సమంత నటించింది.
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న లు హీరోహీరోయిన్లుగా రూపొందిన సినిమా పుష్ప - ది రైజ్. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బన్నీ ఇంతకుముందు సినిమాల్లో ఎన్నడూ లేనంత ఊర మాస్ గెటప్ లో కనిపిస్తూ.. మాస్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్ డేట్.. పుష్ప పై ఉన్న హైప్ ను మరింత పెంచేస్తున్నాయి.
నాలుగూ సూపర్ హిట్...
ఇప్పటి వరకూ పుష్ప సినిమా నుంచి నాలుగు పాటలు విడుదలవ్వగా... ఆ నాలుగు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా పుష్ప సినిమా నుంచి ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ ఐటెం సాంగ్ లో సమంత నటించింది. యువతను ఉర్రూతలూగించేలా పాట సాగుతోంది. పుష్ప సినిమాకు ఈ పాట మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే పాటను చంద్రబోస్ రచించగా.. ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. కాగా.. డిసెంబర్ 12వ తేదీన యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.
Next Story