Fri Feb 28 2025 15:44:24 GMT+0000 (Coordinated Universal Time)
హరిహర వీరమల్లు నుంచి పోస్టర్ విడుదల
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం. పవన్ కల్యాణ్..

హైదరాబాద్ : భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కల్యాణ్.. తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అదే హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మోడ్ లో ఉంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ ఏడాది దసరా కి హరిహర వీరమల్లును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది.
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం. పవన్ కల్యాణ్ శ్రీరాముడి చిత్రపటానికి పూలమాల వేసి.. పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాగే సినిమా నుంచి మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు. "ఈ పవిత్రమైన శ్రీరామనవమిని శౌర్యానికి, పుణ్యానికి ప్రతీకగా జరుపుకుందాం" అంటూ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది.
Next Story