Mon Dec 23 2024 12:25:21 GMT+0000 (Coordinated Universal Time)
ఎఫ్ 3 ఫన్ మొదలయింది.. వెంకీ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
హీరో విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఎఫ్ 3 సినిమాలో వెంకీ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేయా నవ్వించారు. ఆ తర్వాత ఎఫ్ 3 సినిమా అనౌన్స్ మెంట్ చేశారు. షూటింగ్ కూడా జరుగుతోంది. కానీ.. ఈ సినిమా నుంచి ఇంతవరకూ ఏ చిన్న అప్ డేట్ వచ్చింది లేదు. తాజాగా హీరో విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో వెంకీ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోతో ఫ్యాన్స్ కు సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇందులో వెంకీ నిజామీ లుక్ లో కనిపిస్తున్నారు. తన చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్ ముందు విశ్రాంతి తీసుకుంటూ.. నోట్లతో విసురుకుంటూ.. రాజులా రాయల్ లుక్ లో కనిపిస్తారు వెంకీ. అయితే మూవీలోని ఓ పాట నుంచి ఈ వీడియో క్లిప్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సంస్కృతిని కన్విన్సింగ్గా ప్రదర్శించారు.
బర్త్ డేకు.....
వెంకీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఎఫ్ 2 లో.. రెండు ఎఫ్ లు ఫన్, ఫ్రస్ట్రేషన్ గా చూపించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఎఫ్ 3లో ఆ మూడో ఎఫ్ గురించి ఇంతవరకూ ఎక్కడా బయటపడకుండా కేర్ తీసుకున్నారు. ఆ మూడో ఎఫ్ ఏమై ఉంటుందో అని తెలుసుకోవాలనే అందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ 3ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Next Story