Mon Dec 23 2024 16:31:22 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ భర్తతో తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయిన మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కొన్నేళ్ల వివాహం తర్వాత విడిపోయిన
బాలీవుడ్ నటి మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కొన్నేళ్ల వివాహం తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే..! విడిపోయాక అర్బాజ్ ఖాన్‌తో తన సంబంధం చాలా మెరుగుపడిందని నటి మలైకా అరోరా వెల్లడించారు. ఈ జంట 1998లో వివాహం చేసుకున్నారు. 2017లో తమ విడాకులను ఖరారు చేసుకున్నారు. మలైకా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుండగా.. అర్బాజ్ ఖాన్ జార్జియా ఆండ్రియానితో కలిసి ఉంటున్నాడని తెలుస్తోంది.
ఓ మ్యాగజైన్‌తో మాట్లాడిన మలైకా, తనకు అర్బాజ్‌కు ఇప్పుడు మంచి అనుబంధం ఉందని తెలిపింది. "మేము చాలా పరిణతి చెందినవాళ్లం. మేము సంతోషంగా, ప్రశాంతంగా ఉన్న వ్యక్తులం. అతను అద్భుతమైన వ్యక్తి, నేను అతను జీవితంలో ఉత్తమంగా ఎదగాలని మాత్రమే కోరుకుంటున్నాను. కొందరు వ్యక్తులు అద్భుతంగా ఉంటారు.. కానీ వారు కలిసి ఉండలేరు. నేనెప్పుడూ అతనికి మంచి జరగాలని కోరుకుంటాను." అని ఆమె చెప్పుకొచ్చింది. అర్జున్- మలైకా 2019లో వారి రిలేషన్షిప్ గురించి పబ్లిక్‌గా చెప్పుకొచ్చారు. వారు చాలా సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. మలైకా ప్రస్తుతం కొన్ని సినిమాల్లోనూ, టీవీ షోలలో జడ్జిగానూ వ్యవహరిస్తూ ఉంది.
Next Story