Mon Dec 23 2024 13:00:14 GMT+0000 (Coordinated Universal Time)
మాళవిక బర్త్ డే స్పెషల్.. PAPA నుండి కొత్త లుక్
రెండ్రోజుల క్రితమే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. అదే "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". నటుడు అవసరాల శ్రీనివాస్..
మాళవిక నాయర్.. ఈ అమ్మాయి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది "కళ్యాణ వైభోగమే" సినిమా. నాగశౌర్య - మాళవిక జంటగా చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎవడే సుబ్రమణ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మాళవికకు కళ్యాణ వైభోగమే సినిమాతో గుర్తింపు లభించింది. విజేత, రాజుగారి గది 3, మహానటి, టాక్సీవాలా, ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్యూ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. మరోసారి నాగశౌర్యతో జోడీ కడుతోంది ఈ మలయాళ బ్యూటీ.
రెండ్రోజుల క్రితమే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. అదే "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". నటుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న.. క్లీన్ లవ్ స్టోరీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. తొలి పోస్టర్లో నాగశౌర్య-మాళవిక చూడముచ్చటగా కనిపించారు. నేడు మాళవిక పుట్టినరోజు సందర్భంగా PAPA టీమ్.. ఆమెకు విషెస్ చెబుతూ.. ఆమె బ్యూటిఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎల్లో కలర్ డ్రెస్ లో పొద్దు తిరుగుడు పువ్వులా కనిపిస్తోంది మాళవిక.
Next Story