Sun Dec 22 2024 22:23:33 GMT+0000 (Coordinated Universal Time)
అనారోగ్యంతో ప్రముఖ నటి మృతి
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసేలోపే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది.
ప్రముఖ మలయాళ టెలివిజన్ నటి, యాంకర్ సుభి సురేష్ (42) అనారోగ్యంతో కన్నుమూసింది. కొద్దిరోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. కోచిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసేలోపే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. డ్యాన్సర్, కమెడియన్, యాంకర్ గా సుభి సురేష్ ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె నిర్వహించిన సినీమాల, కుట్టి పట్టాలం టీవీ షో లు ఆదరణ పొందాయి.
అలాగే ఎన్నో టెలివిజన్ షో లలో సుభి సురేష్ కీలక పాత్ర పోషించింది. 20కి పైగా సినిమాల్లోనూ నటించింది. మిమిక్రీ లోనే ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ఉండే సుభి.. కాలేయ సమస్య కారణంగా కన్నుమూయడం అభిమానులను కలచివేసింది. సుభికి తండ్రి సురేష్, తల్లి అంబిక, సోదరుడు అభీ సురేష్ ఉన్నారు. సుభి అకాల మరణం పట్ల మలయాళ ప్రముఖులు నివాళులు అర్పించారు.
Next Story