Mon Dec 23 2024 14:30:16 GMT+0000 (Coordinated Universal Time)
Shine Tom Chacko : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఎంగేజ్మెంట్..
దసరా, దేవర సినిమాలతో తెలుగు వారికీ దగ్గరవుతున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
Shine Tom Chacko : నాని 'దసరా' సినిమాలో విలన్ గా నటించి టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ స్టార్ యాక్టర్ షైన్ టామ్ చాకో. తాజాగా ఈ నటుడు తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మోడల్ అయిన 'తనూజ'తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న షైన్ టామ్.. ఇప్పుడు ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ ని తన ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన చాలా సింపుల్ గా చేసేసుకున్నారు.
కాగా షైన్ టామ్ కి ఇది రెండు వివాహం అని చెబుతున్నారు. ఆల్రెడీ ఆయనికి పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆ వివరాలు గురించిన సమాచారం అయితే లేదు. ఇక ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను షైన్ టామ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి తెలియజేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఆ ఫోటోలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న షైన్ టామ్.. ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాగశౌర్య ‘రంగబలి’లో కూడా విలన్ చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటితో మలయాళ, తమిళ భాషల్లో కూడా నటిస్తూ కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.
Next Story