Sun Dec 22 2024 21:13:52 GMT+0000 (Coordinated Universal Time)
Prashanth Nair and lena:ఆయన్ను పెళ్లి చేసుకున్నా.. చెప్పలేకపోయిన నటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ గగనయాన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను
భారత ప్రధాని నరేంద్ర మోదీ గగనయాన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రపంచానికి తెలియజేసారు. ఈ నలుగురు భారతీయ వైమానిక దళ అధికారులు. నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాడర్ శుభాంశు శుక్లా అని ప్రధాని మోదీ తెలిపారు. నలుగురు వ్యోమగాములు రష్యాలో విస్తృతమైన శిక్షణ పొందారు. ఇప్పుడు భారతదేశంలో ఇస్రో శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. గగన్‌యాన్ మిషన్ ముగ్గురు వ్యోమగాములతో కూడిన సిబ్బందిని 'లో ఎర్త్ ఆర్బిట్' లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యోమగాముల గురించి తెలుసుకోడానికి మనోళ్లు ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తూ ఉన్నారు. ఇంతలో మలయాళ నటి లీనా గగన్‌యాన్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని లీనా ఫిబ్రవరి 27, మంగళవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ జంట జనవరి 17, 2024న వివాహం చేసుకున్నారు. గ్రూప్ కెప్టెన్ నాయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో టెస్ట్ పైలట్. గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరిగా గ్రూప్ కెప్టెన్ నాయర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న కొన్ని గంటల తర్వాత, లీనా ఆయన్ను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సగర్వంగా ప్రకటించింది. తాము జనవరి 17న వివాహం చేసుకున్నామని.. అయితే గోప్యత పాటించడం కోసం ఆ విషయాన్ని బహిర్గతం చేయలేకపోయామని ఆమె తెలిపింది. ప్రశాంత్‌తో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని వివరించింది.
లీనా భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ సినిమాలలో కనిపించింది. ఆమె ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషలలో కూడా నటించారు. ఆమె 100కి పైగా సినిమాలలో నటించింది. ఎన్నో అవార్డులను సైతం లీనా అందుకుంది.
Next Story