Wed Apr 23 2025 10:17:11 GMT+0000 (Coordinated Universal Time)
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో కమెడియన్ మృతి
గడిచిన ఏడాదిన్నర కాలంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు అనారోగ్యం, కరోనా కారణంగా కన్నుమూశారు. తాజాగా మరో కమెడియన్

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు అనారోగ్యం, కరోనా కారణంగా కన్నుమూశారు. తాజాగా మరో కమెడియన్ గుండెపోటుతో మరణించారు. ప్రముఖ మలయాళ కమెడియన్ ప్రదీప్ కొట్టాయమ్(61) గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రదీప్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. 40 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్.. 70కి పైగా సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : అడవిని దత్తత తీసుకున్న నాగార్జున దంపతులు !
రాజా రాణి, ఏమాయ చేశావే వంటి సినిమాల్లో నటించగా.. ఏమాయ చేశావే లో జార్జ్ అంకుల్ పాత్ర ఆయన మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన ఎల్ఐసీ ఏజెంట్ గా పనిచేశారు. గురువారం ఉదయం 3 గంటలకు గుండెల్లో నొప్పిగా ఉండటంతో.. ఆయన సన్నిహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రదీప్ కొట్టాయమ్ 4.30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Next Story