Mon Dec 23 2024 07:27:07 GMT+0000 (Coordinated Universal Time)
జైలర్ విడుదల వాయిదా
అదే టైటిల్ తో మలయాళంలో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా వస్తున్న జైలర్ సినిమా కూడా ఆగస్ట్ 10నే
టైటిల్ చూసి సూపర్ స్టార్ రజనికాంత్ జైలర్ సినిమా రిలీజ్ ఆగిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే రజనీకాంత్ జైలర్ సినిమాతో పాటు మరో సినిమా కూడా అదే పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రజనీకాంత్ సినిమాతో పాటు తమ సినిమాను విడుదల చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని భావించి వెనక్కు తగ్గారు. రజనీకాంత్ జైలర్ సినిమా భారీ ఎత్తున విడుదల అవుతూ ఉండగా.. అదే టైటిల్ తో మలయాళంలో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా వస్తున్న జైలర్ సినిమా కూడా ఆగస్ట్ 10నే విడుదల కావాల్సి ఉంది. ఒకే రోజు రెండు 'జైలర్' అనే సినిమాలు కావడంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందనుకున్నారో.. లేక రజనీ సినిమాతో పోటీ పడడం ఎందుకు అని అనుకున్నారో కానీ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు.
రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్గా విడుదల కానుంది. ఇదే టైటిల్తో మలయాళంలో జైలర్ సినిమా విడుదల వాయిదా పడింది. జైలర్ టైటిల్ వివాదం విషయంలో మలయాళ డైరెక్టర్ సక్కిల్ మదాథిల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రజనీకాంత్ సినిమాకు భారీ హైప్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమాతో పోటీ పడకుండా మలయాళం సినిమా 'జైలర్' విడుదల వాయిదా పడింది. మలయాళ జైలర్ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. రజినీకాంత్ జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే సినిమాకు భారీ హైప్ వచ్చింది.
Next Story