Mon Dec 23 2024 16:29:21 GMT+0000 (Coordinated Universal Time)
Yatra 2 : యాత్ర 2 టీజర్ వచ్చేసింది..
వైఎస్ జగన్ లైఫ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న యాత్ర 2 టీజర్ వచ్చేసింది.
Yatra 2 : ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ కథాంశంతో 'యాత్ర 2' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో జీవ.. వైఎస్ జగన్ పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన సీఎం ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. యాత్ర 1ని డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్.. ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Next Story