Wed Mar 26 2025 22:33:05 GMT+0000 (Coordinated Universal Time)
PVR Passport : మూవీ లవర్స్ కు పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్
సినిమా ప్రేమికులకు పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెలంతా 699 రూపాయలతో సినిమాలు చూసేయవచ్చు

సినిమా ప్రేమికులకు పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెలంతా ఏడు వందల రూపాయలతో సినిమాలు చూసేయవచ్చని పేర్కొంది. 699 రూపాయలు చెల్లిస్తే నెలలో పది సినిమాలు చూసే అవకాశం పీవీఆర్ సినిమాస్ లో కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుక కొన్ని కండిషన్లు మాత్రం పెట్టింది. మూవీ పాస్ తో నెలంతా సినిమాలు చూసే అవకాశాలు ఇప్పటికే ఉత్తరాదిలో అమలు చేస్తున్నారని, ఇప్పుడు కొత్తగా ఇక్కడ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
మూవీ పాస్ తో...
నెలలో పది సినిమాలు మాత్రమే చూడాల్సి ఉంటుంది. అలాగే సోమ, గురువారాల్లో మాత్రమే ఈ 699 రూాపాయల టిక్కెట్ చెల్లుబాటు అవుతుందని, మిగిలిన రోజుల్లో ఈ టిక్కెట్ పనిచేయదని పేర్కొంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కావడం, వీకెండ్ లో ఎక్కువ రష్ ఉన్నందున ఈ రకమైన షరతులు విధించింది. సో ఇక మూవీ లవర్స్ పది సినిమాలు పీవీఆర్ సినిమాల్లో 699 రూపాయలకే చూసేయొచ్చు. అంటే ఒక్కొక్క టిక్కెట్ 69 రూపాయలు మాత్రమే పడుతుంది.
Next Story