Wed Nov 27 2024 09:57:42 GMT+0000 (Coordinated Universal Time)
బంతిని భార్య కోర్టులో వదిలేసిన మంచు మనోజ్
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ నటుడు మంచు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ దంపతులు కలిశారు. టీడీపీ అధినేత నివాసానికి మనోజ్, మౌనిక వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. మంచు మనోజ్ ఇటీవలే భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ దంపతులు చంద్రబాబును కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నాయకురాలు. గత టీడీపీ హయాంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు వీరు చంద్రబాబు నాయుడిని కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ కు కారణమైంది.
ఇక మంచు మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. ఆయన గతంలో టీడీపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అప్పట్లోనే 2019 ఎన్నికల్లో మనోజ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య వైఎస్ కుటుంబానికి చెందిన వారే కావడంతో వైసీపీతో సత్సంబంధాలు ఉన్నాయి.
తాజాగా రాజకీయ రంగ ప్రవేశంపై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం మనోజ్ ఈ అంశంపై స్పందించారు. రాజకీయాల్లోకి రావడంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుందని మీడియాకు తెలిపారు. తామంటే చంద్రబాబుకు ఎంతో అభిమానమని చెప్పారు. మౌనికతో వివాహం తర్వాత ఆయనను కలవాలనుకున్నప్పటికీ కుదరలేదని, ఆ తర్వాత చంద్రబాబు బిజీ అయ్యారన్నారు. మా భేటీ లో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. రేపు మా బాబు పుట్టినరోజు కావడంతో ఆయన బ్లెస్సింగ్స్ కోసం వచ్చామని అన్నారు. పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామని చంద్రబాబు నాయుడు తనతో అన్నారని, ఉదయం ఫోన్ చేసి రమ్మంటే వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు కూడా తీసుకున్నామన్నారు.
Next Story