Mon Dec 23 2024 10:16:32 GMT+0000 (Coordinated Universal Time)
మంచు వారింట మొదలైన పెళ్లిసందడి.. రేపే మనోజ్-మౌనికల వివాహం
సినీ హీరో మంచు మనోజ్ - దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు.
ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట పెళ్లిసందడి మొదలైంది. రేపే మంచువారింట బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు, సినీ హీరో మంచు మనోజ్ - దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 3న వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నివాసంలో పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లి నిర్వహణకై ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మార్చి 1 (బుధవారం) మెహందీ వేడుకతో మనోజ్ - మౌనిక ల పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు సంగీత్ కార్యక్రమం జరగనుంది. కాగా.. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే అన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి తొలి వైవాహిక జీవితాలు ముగిసిపోయాయి. మంచి స్నేహితులైన వీరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. గతేడాది ఇద్దరూ కలిసి వినాయక పూజలో పాల్గొనప్పుడు కూడా ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే.. ఇప్పటికీ వీరి వివాహంపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
Next Story