Mon Dec 23 2024 13:38:40 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి 3న మంచు మనోజ్ పెళ్లి.. వ్యాపిస్తున్న పుకార్లు !
గతేడాది వినాయకచవితి సందర్భంగా ఇద్దరూ కలిసి ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుండీ వీరిద్దరి..
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డి మార్చి 3వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి పెళ్లి పై ఇప్పటికే పుకార్లు వ్యాపించగా.. ఇరుకుటుంబాలు ఈ విషయంపై పెదవి విప్పలేదు. పైగా కొన్నాళ్లు మనోజ్ - మౌనిక బహిరంగంగా కలిసి కనిపిస్తుండటం.. ఈ పుకార్లకు బలం చేకూరినట్లవుతోంది.
గతేడాది వినాయకచవితి సందర్భంగా ఇద్దరూ కలిసి ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుండీ వీరిద్దరి రిలేషన్ పై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలా కాలంగా మంచి స్నేహితులుగా ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవడం ద్వారా తమ సంబంధాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మార్చి 3న వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ సమాచారమంతా నిజమా లేక.. పుకార్లుగానే మిగిలిపోతాయా తెలియాల్సి ఉంది.
Next Story