Mon Dec 23 2024 11:06:15 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ అన్నకి ఆల్ ది బెస్ట్.. మంచు మనోజ్..
మరోసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మంచు మనోజ్.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిందటి ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈ ఎన్నికల్లో జనసేన జెండా ఎక్కువ చోట్ల ఎగిరేలా ప్లాన్స్ వేస్తున్నారు. ఇక పవన్ చేసే ఈ ప్రయత్నాలకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మెగా ఫ్యామిలీ అంతా చెప్పుకొస్తూనే ఉంటుంది. వారితో పాటు ఇండస్ట్రీలో ఇతరాలు కూడా పవన్ కి సపోర్ట్ గా నిలిస్తున్నారు.
హైపర్ ఆది, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లాంటివారు.. జనసేన కోసం జనంలోకి వస్తున్నారు. ఇక ఇటీవల యాంకర్ అనసూయ కూడా.. జనసేన పిలిస్తే తప్పకుండా వెళ్తా అంటూ కామెంట్ చేసారు. ఇక మంచు వారసుడు మనోజ్.. కొన్ని రోజుల నుంచి పవన్ కి ఇన్డైరెక్ట్ సపోర్ట్ తెలియజేస్తూ వస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ.. "మంచి కోసం నలుగురితో పొత్తు పెట్టుకునేవాడని ఎన్నికొండి" అంటూ ఇన్డైరెక్ట్గా పవన్ గురించి మాట్లాడారు.
ఇక తాజాగా మరోసారి పవన్ పొలిటికల్ లైఫ్ ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నిన్న మార్చి 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి హాజరయ్యిన మనోజ్ మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్" అంటూ రాబోయే ఎలక్షన్స్ ఉద్దేశించి కామెంట్స్ చేసారు. అంతేకాదు, మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య ఉన్నదీ భార్య భర్తల స్నేహమని, ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు చూసి స్నేహం లేదు అనుకుంటే అది పొరపాటని పేర్కొన్నారు.
Next Story