Mon Dec 23 2024 19:02:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆ విషయంలో మంచు విష్ణుపై కోప్పడ్డ మోహన్ బాబు
మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా'. జి. నాగేశ్వర రెడ్డి కథను అందించిన ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లేను సమకూర్చగా సూర్య దర్శకత్వం వహించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లోను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. మోహన్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఏ సినిమా కోసం చేయని రిస్కీ షాట్లు ఈ సినిమా కోసం విష్ణు చేశాడు. ఇకపై అలా చేయవద్దని మందలించారు మోహన్ బాబు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఈ సినిమాతో సూర్య పెద్ద దర్శకుడు అవుతాడని భావిస్తున్నాను. ఈ సినిమాకి భాను - నందు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయని తెలిపారు.
ఈ నెల 21వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది జిన్నా. సినిమాలో హీరోయిన్లు అయిన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ లు కార్యక్రమానికి హాజరు అవ్వలేదు. మంచు విష్ణు జిన్నా టైటిల్ అర్థం రివీల్ చేశాడు. "జిన్నా అంటే లోడ్ చేసిన గన్ టచ్ చేస్తే దీపావళే" అంటూ విష్ణు తెలిపాడు. దర్శకుడు సూర్య తెరకెక్కించిన ఈ చిత్రం హారర్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కింది. AVA ఎంటర్టైన్మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ జిన్నా చిత్రానికి సంగీతం అందించారు.
Next Story