Mon Dec 23 2024 19:36:02 GMT+0000 (Coordinated Universal Time)
Kannappa Vishnu ముదిరిపోతున్న కన్నప్ప వివాదం.. ఇంతకూ ఆ ఈమెయిల్ ఎవరిది?
మంచు విష్ణు క్రియేటర్లను వేధిస్తున్నారని ఆరోపించారు
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లను మంచు విష్ణు ఇటీవల కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. MAA ప్రెసిడెంట్ ఇటీవల డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు అవమానకరమైన, ఇతరులను ఇబ్బంది పెట్టే వీడియోలను క్రియేట్ చేయడానికి వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి డిజిటల్ కంటెంట్ క్రియేటర్లందరికీ ఒక సందేశం.. ఇకపై నటులు, నటీమణులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వీడియోలు లేదా వ్యాఖ్యలను సహించబోమని అన్నారు. కంటెంట్ క్రియేటర్లకు 48 గంటల అల్టిమేటం ఇస్తున్నామని.. అంతలోపు వారు తమ ఛానెల్‌ల నుండి పరువుకు నష్టం కలిగించే వీడియోలు లేదా మీమ్లను తీసివేయవలసి ఉంటుందని తెలిపారు. తమ హెచ్చరికలను పాటించడం విఫలమైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఈ హెచ్చరికల తర్వాత అనేక యూట్యూబ్ ఛానెల్‌ల మీద స్ట్రైక్ వేశారు. దీనికి ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ముందుకు వచ్చి.. మంచు విష్ణు క్రియేటర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. యూట్యూబర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. కన్నప్ప గురించి యూట్యూబర్లు మంచిగా వీడియోలను సృష్టిస్తే.. మంచు విష్ణు ఆయా ఛానెల్‌పై స్ట్రైక్ ను ఎత్తివేసేందుకు అంగీకరించినట్లు ఆ లెటర్ వచ్చిందని ఆరోపించారు. యూట్యూబర్ విష్ణు ప్రొడక్షన్ హౌస్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుండి తనకు వచ్చిన మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. ఈ వార్త వైరల్ కావడంతో, మంచు విష్ణు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ సమస్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ-మెయిల్ తమ అధికారిక ఖాతా నుండి రాలేదని ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Next Story