Mon Dec 23 2024 10:31:40 GMT+0000 (Coordinated Universal Time)
వైరల్ అవుతున్న వీడియో వివాదంపై స్పందించిన మంచు విష్ణు
సారథిలో తన వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడని, దానిని వీడియో తీసి ఇలా పెట్టాడన్నారు. మనోజ్ ఇంకా చిన్నవాడు అని..
సెలబ్రిటీల ఇళ్లలో ఎన్నిగొడవలున్నా వాటిని సాధారణంగా బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా పరిష్కరించుకుంటారు. కానీ.. మంచు ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా సోషల్ మీడియాకి ఎక్కాయి. మంచు మనోజ్ షేర్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది. మధ్యలో మోహన్ బాబు కలుగజేసుకోవడంతో..ఆయన వీడియోను డిలీట్ చేశారని తెలుస్తోంది. కాగా.. తాజాగా ఈ వీడియోపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు.
తామిద్దరి మధ్య గొడవలు చాలా సాధారణమని విష్ణు పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న గొడవ నిన్నఉదయం జరిగిందని, అది చిన్న సంఘటన అని తెలిపాడు. సారథిలో తన వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడని, దానిని వీడియో తీసి ఇలా పెట్టాడన్నారు. మనోజ్ ఇంకా చిన్నవాడు అని.. ఈ విషయం స్పందించాల్సినంత పెద్ద విషయం కాదన్నారు. అలాగే ఓ ఛానల్ తో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి తనకు తెలీదన్నారు. ఈ వివాదం గురించి తాను మనోజ్, విష్ణు లతో మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం తాను కుటుంబ సభ్యులతో బిజీ గా ఉందని, అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాక దానిపై మాట్లాడుతానన్నారు.
Next Story