Sat Nov 23 2024 03:05:44 GMT+0000 (Coordinated Universal Time)
16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్
బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలోనూ పీఎస్-1 పోటీ పడనుంది. ఇక ఆర్ఆర్ సినిమా ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లలో రెండు కేటగిరీ..
16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లకు సౌత్ సినిమాలు ఎంపికయ్యాయి. వాటిలో రాజమౌళి ఆర్ఆర్ఆర్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 సినిమాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్ సినిమా మొత్తం ఆరు కేటగిరీల్లో నామినేషన్లకు ఎంపికైంది. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలోనూ పీఎస్-1 పోటీ పడనుంది. ఇక ఆర్ఆర్ సినిమా ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లలో రెండు కేటగిరీల్లో చోటు సంపాదించింది. భారత్ నుండి ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ఎంపిన చిత్రాలు ఈ రెండు మాత్రమే. ఈ నామినేషన్లపై అకాడమీ ట్విట్టర్లో ప్రకటన చేసింది.
పొన్నియన్ సెల్వన్ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), బెస్ట్ సినిమాటోగ్రఫీ (రవి వర్మన్), బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ (ఏఆర్ రెహమాన్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (ఎక లఖాని), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (తోట తరణి) విభాగాల్లో అర్హత లభింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్), బెస్ట్ సౌండ్ (అశ్విన్ రాజశేఖర్) విభాగాల్లో అర్హత పొందింది. ఈ ఏడాది మార్చి12, ఆదివారం రాత్రి 7.30 గంటలకు హాంగ్ కాంగ్ ప్యాలెస్ మ్యూజియంలో 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంగా వైభవంగా జరుగుతుందని ఏషియల్ ఫిల్మ్ అవార్డ్స్ అకాడమీ ట్వీట్ లో పేర్కొంది.
Next Story