Mon Dec 23 2024 14:06:27 GMT+0000 (Coordinated Universal Time)
Mani Sharma : మణిశర్మని బాధపెడుతున్న పవన్, మహేష్..
మెలోడీ బ్రహ్మ మణిశర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తనని బాధపెడుతున్నట్లు పేర్కొన్నారు.
Mani Sharma : టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని తన బాధని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్, మహేష్‌కు మణిశర్మ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు అనడం కంటే.. తమ కెరీర్స్ లో ఎప్పటికి నిలిచిపోయే ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇచ్చారు అనే చెప్పాలి. ఇప్పటికి ఆయా హీరోల అభిమానులు ఎక్కువగా వినే సాంగ్స్ లో ఫేవరెట్ లిస్ట్ మణిశర్మ కంపోజ్ చేసినవే ఉంటాయి. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు.
ఈ విషయం గురించి మణిశర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బాధ కలిగించేది ఏంటంటే, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు. అన్ని నాకే ఇవ్వమని అడగడం లేదు. దేవిశ్రీప్రసాద్, థమన్ లాంటి వాళ్ళకి రెండు సినిమాలు ఇచ్చి.. నా లాంటి వాళ్ళకి ఒక సినిమా అయినా ఇస్తే బాగుంటుంది కదా. ఆడియన్స్ కి కూడా డిఫరెంట్ మ్యూజిక్ విన్నట్లు ఉంటుంది" అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
ఇక ఈ వీడియో చూసిన మ్యూజిక్ లవర్స్.. ఎన్నో ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇచ్చిన ఈయన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాము అని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసైనా టాలీవుడ్ లోని సీనియర్ హీరోలు మణిశర్మకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. కాగా మణిశర్మ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పటి డైరెక్టర్స్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా కథ చెప్పకుండా మ్యూజిక్ చేయమంటున్నారట. కథని తాను ఫీల్ అవ్వకపోతే మంచి మ్యూజిక్ ఎలా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Next Story