Mon Dec 23 2024 12:08:18 GMT+0000 (Coordinated Universal Time)
మీరు మా జీవితానికే సూపర్ స్టార్ నాన్న.. మంజుల ఎమోషనల్ ట్వీట్
నాన్న నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్ కాదు మా జీవితానికి కూడా సూపర్ స్టార్. మీరు బయట ఎలా ఉన్నపటికీ ఇంటిలో మాకోసం..
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాద వాతావరణం నెలకొంది. సూపర్ స్టార్ ఇకలేరన్న వార్త విని అభిమానులతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. సినీ పెద్దలు ఘట్టమనేని కుటుంబానికి, మహేశ్ కు ధైర్యం చెప్తూ ఓదార్చుతున్నారు. కృష్ణ కూతుళ్లలో ఒకరైన మంజుల తన తండ్రి మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
"నాన్న నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్ కాదు మా జీవితానికి కూడా సూపర్ స్టార్. మీరు బయట ఎలా ఉన్నపటికీ ఇంటిలో మాకోసం ఒక సాధారణ తండ్రిలా మాకు మీ ప్రేమానురాగాలు పంచడం మాకు ఎంతో గర్వకారణం. మీరు ఉన్నా లేకపోయినా మీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వెండితెరపై మీ జ్ఞాపకాలు ఎప్పటికి చెరిగిపోనివి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం." అంటూ ఎమోషనల్ అయింది. మంజుల చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తండ్రి మరణంతో తీవ్రదుఃఖంలో ఉండటంతో.. మహేష్ రెండ్రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.
Next Story