Mon Dec 23 2024 01:28:55 GMT+0000 (Coordinated Universal Time)
Anshu Ambani: ఆయన వల్లే ఇండస్ట్రీని వదిలేశానంటున్న 'మన్మథుడు' హీరోయిన్..
సినిమాలు ఇండస్ట్రీని వదిలేయడానికి కారణం ఆయనే. మన్మథుడు టైములో ఎంతో ఇబ్బంది పడ్డాను.
Anshu Ambani : ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ తమ ఎంట్రీతోనే అభిమానుల మనసుని దోచుకుంటుంటారు. ఇక ఆ అందాల భామలను మరిన్ని సినిమాల్లో చూడాలని ఆడియన్స్ అనుకుంటున్న సమయంలోనే.. ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతుంటారు. అలా కెరీర్ బిగినింగ్ లోనే వెళ్లిపోయిన హీరోయిన్ 'అన్షు అంబానీ'. నాగార్జున 'మన్మథుడు' మూవీలో హీరోయిన్ గా నటించిన అన్షు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.
దీంతో ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాతో పాటు ఓ తమిళ సినిమా అవకాశం అందుకున్నారు. కానీ అవి చేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని.. మూడు సినిమాలతోనే యాక్టింగ్ కెరీర్ కి ఎండ్ కార్డు వేసేసారు. అయితే ఆమె ఇలా ఎందుకు చేసారు అనేది ఆడియన్స్ లో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. పెళ్లి తరువాత సినిమాలకు పూర్తి దూరమైన అన్షు.. ఇటీవల మన్మథుడు రీ రిలీజ్ సమయంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తాజాగా ఓ తెలుగు వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అన్షు.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటనేది తెలియజేసారు. సినిమాలోకి వచ్చినప్పుడు ఆమెది చాలా యంగ్ ఏజ్ కావడం, అంతేకాకుండా ఆమె తండ్రి ఓవర్ ప్రొటెక్టీవ్ కావడంతో.. సినిమాల్లో తాను ఏం చెయ్యాలి, ఇండస్ట్రీలో తాను ఎవరితో మాట్లాడాలి అనేవి ఆమె తండ్రే నిర్ణయించేవారట. దీంతో ఆ సమయంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నారట.
ఇక అలాంటి పరిస్థితుల మధ్య ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని అనిపించి తప్పుకున్నారట. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ల తరువాత ఇండస్ట్రీకి తిరిగి వద్దామని నిర్ణయించుకున్నారట. ఈక్రమంలోనే తాను ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈమెను ఏ సినిమాలో ఎలాంటి పాత్రలో చూస్తామో చూడాలి. కాగా పెళ్లి చేసుకున్న ఈమెకు ఒక కూతురు కూడా ఉంది.
Next Story