Mon Dec 23 2024 19:04:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీ సూపర్ హిట్ మూవీలో హీరోగా చేయాల్సింది.. కానీ సైడ్ క్యారెక్టర్.. అయినా నేషనల్ అవార్డు..
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ట్రెండ్ సెట్టర్ సినిమాలో హీరోగా ఎంపిక అయ్యి సపోర్టింగ్ రోల్ చేయాల్సి వచ్చింది. అది ఏ సినిమా తెలుసా..?
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee).. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'ప్రేమ కథ' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత హ్యాపీ, పులి, వేదం వంటి సినిమాలతో ఇక్కడ వారిని పలకరించాడు. ఇక ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే, ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఒక సినిమాలో మనోజ్ బాజ్పాయ్ హీరోగా ఎంపిక అయ్యి సపోర్టింగ్ రోల్ చేయాల్సి వచ్చింది.
ఆ సినిమా మరేదో కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'సత్య' (Satya). అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టార్ సినిమాలకు సత్య ఒక రిఫరెన్స్ గా నిలిచింది. ఈ సినిమాలో జె డి చక్రవర్తి హీరోగా నటించగా ఊర్మిళ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ చిత్రానికి హీరోగా ముందు అనుకున్నది మనోజ్ బాజ్పాయ్ని. ఆ విషయం వర్మ, మనోజ్ కి కూడా తెలియజేశాడు. ఆర్జీవీ దర్శకత్వంలో హీరోగా సినిమా వస్తుండడంతో మనోజ్ ఎంతో సంతోష పడ్డాడు.
అయితే కథని మెరుగుపరిచే సమయంలో హీరో పాత్రకి జె డి చక్రవర్తి అయితే బాగుంటుందని వర్మకి అనిపించడంతో మనోజ్ బాజ్పాయ్ కి సెకండ్ లీడ్ పాత్రని ఇచ్చాడు. హీరో నుంచి సపోర్టింగ్ రోల్ కి రావడంతో మనోజ్ చాలా బాధ పడినట్లు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ ఆ సెకండ్ లీడ్ పాత్ర మనోజ్ కి ఎంతో పేరుని సంపాదించి పెట్టింది. 'బీకూ మాత్రే' పాత్రలో మనోజ్ జీవించేశాడు.
ఆ సినిమాలో ఎక్కువ క్రేజ్ వచ్చింది ఆ పాత్రకే. మాస్ ఆడియన్స్ 'బీకూ మాత్రే' పాత్రని ఓన్ చేసేసుకున్నారు. మూవీ రిలీజ్ అయిన చాలా కాలం పాటు మనోజ్ ని 'బీకూ' పేరుతోనే పిలిచేవారట చాలామంది. ఇక ఈ నటనతో మనోజ్ బాజ్పాయ్.. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు. ఇటీవల సత్య చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
Next Story