Mon Dec 23 2024 15:04:39 GMT+0000 (Coordinated Universal Time)
Trisha : ఎట్టకేలకు త్రిషకి క్షమాపణలు చెప్పిన మన్సూర్..
ఎట్టకేలకు త్రిషకి క్షమాపణలు చెప్పిన మన్సూర్. ఒక వారం పాటు ఆయుధం లేకుండా యుద్ధం చేసినట్లు..
Trisha vs Mansoor Alikhan : గత కొన్నిరోజులుగా తమిళ ఇండస్ట్రీలో.. త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదంగా సంచలనంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ.. లియో సినిమాలో త్రిషని రేప్ చేసే సీన్ తనకి రానందుకు చాలా ఫీల్ అయ్యాను అంటూ చేసిన వ్యాఖ్యలో వివాదానికి దారి తీశాయి. ఇక ఈ కామెంట్స్ పై త్రిష సీరియస్ అవ్వడం ఆమెకు సపోర్ట్ గా టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో విషయం బాగా సీరియస్ అయ్యింది.
దీంతో జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తమిళ సినిమా పరిశ్రమ యూనియన్ నడిగర్ సంఘం నుంచి కూడా నోటీసులు రావడం జరిగాయి. త్రిషకి క్షమాపణలు చెప్పాలని మన్సూర్ కి నోటీసులు పంపించినా ఆయన క్షమాపణలు చెప్పేదే లేదని వెల్లడించారు. తాను మాట్లాడిన మొత్తం వ్యాఖ్యలు వినకుండా, కేవలం ఒక చిన్న వీడియో చూసి తనని బ్యాడ్ చేసి క్షమాపణలు చెప్పమనడం న్యాయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు త్రిష పై తిరిగి పరువు నష్టం కేసు కూడా వేస్తానంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా మన్సూర్ త్రిషకి క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి చెక్ పెట్టేశారు. మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్.. "ఒక వారం పాటు నేను ఆయుధం లేకుండా యుద్ధం చేశాను. ఈ యుద్ధంలో నేను రక్తపాతం లేకుండానే గెలిచాను. ఈక్రమంలో నాకు అండగా నిలిచిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను తప్పుపట్టిన వారికీ నా వినయపూర్వక నమస్కారమలు. ఇక నా వ్యాఖ్యలతో బాధపడ్డ త్రిషకి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.
అప్పటి కళింగ యుద్ధంలో లక్షలాది మంది మరణాలు చూసి అశోకుడి గుండె బాధపడి అహింసను స్వీకరించిందని, నేడు తాను కూడా అహింసా మార్గం వైపే నిలబడుతూ.. ఈ యుద్దాన్ని ముగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. త్రిష పై తనకి ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్న మన్సూర్.. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం అందించి ఆశీర్వదించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక మన్సూర్ వ్యాఖ్యలు పై పరోక్షంగా స్పందించిన త్రిష.. "తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అనేది దైవ గుణం’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Next Story